News

రజనీ రాజకీయాల్లోకి వస్తే జీరోనే


సీపీఐ నేత నారాయణ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై స్పందించారు. బీజేపీ అండతో రజనీకాంత్‌ రాజకీయాల్లో వస్తే జీరో అవుతారని ఎద్దేవాచేశారు. పశువధపై ఆంక్షల వల్ల దేశ ఐక్యతకు ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశు వధపై ఆంక్షల వెనుక ఓట్ల రాజకీయం ఉందని ఆరోపించారు. కోడి, మేక, ఇతర మాంసం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.